సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పేరు వినగానే స్టైలిష్‌ లుక్స్‌, మెల్లి మెల్లి డైలాగ్స్‌, హ్యాండ్సమ్‌ ప్రెజెన్స్‌ మనకి గుర్తొస్తాయి. కానీ ఈ గ్లామర్‌ వెనక ఒక గోల్డెన్‌ హార్ట్‌ ఉన్నది చాలా మందికి తెలియదు. రీల్‌ లైఫ్‌లో మాస్ హీరో… రియల్‌ లైఫ్‌లో మానవత్వానికి సింబల్‌! సినిమాలు చేసే హీరోలు చాలామంది ఉంటారు కానీ … మహేష్ మాత్రం తన స్టార్‌డమ్‌ని మంచిపనులకు ఉపయోగించుకుంటారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించి కొత్త జీవితం ఇచ్చారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం గ్రామం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
 

టెక్నాలజీ విషయంలో కూడా మహేష్ బాబు ముందుంటారు. తన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు సినిమాల్లో కొత్త ప్రయోగాలు చేసినట్లే… మహేష్ కూడా “నిజం” సినిమాలో డాల్బీ ఎక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. మానవత్వం విషయానికి వస్తే… హుద్‌హుద్ తుపాను సమయంలో సీఎం సహాయ నిధికి రూ. 2.5 కోట్లు విరాళం ఇవ్వడం, కరోనా సమయంలో సినీ కార్మికులకు రూ. 25 లక్షలు అందించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. పర్సనల్ లైఫ్‌లో మహేష్ బాబు చాలా కూల్‌ & సైలెంట్‌. వివాదాలకు దూరంగా ఉంటూ… అవసరమైనంత మాత్రమే మాట్లాడతారు.

 

కానీ ఆయనకు ఒక ప్రత్యేక అలవాటు ఉంది – తెలుగు చదవడం, రాయడం రాకపోవడంతో డైలాగ్స్‌ని దర్శకులతో చెప్పించుకుని గుర్తుపెట్టుకుని చెబుతారు. ఇది ఆయన ప్రొఫెషనలిజానికి ఒక మంచి ఉదాహరణ. ప్రపంచ స్థాయిలో కూడా మహేష్ పేరు నిలిచింది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో వ్యాక్స్ విగ్రహం పొందిన మొదటి తెలుగు నటుడు మహేష్ బాబు. ఈ గౌరవం ఆయనకు మాత్రమే దక్కింది అంటే… ఆయన స్టార్ ఇమేజ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో మాస్ పంచ్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్ హార్ట్ కొట్టేస్తూ… బయట రియల్ లైఫ్‌లో మంచి పనులతో ప్రజల మనసులు గెలుచుకుంటూ… మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగా ఒక ప్రత్యేకమైన స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: