ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటి మణులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె తెలుగులో ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించింది. ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఆ తర్వాత ఈమె అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి భారీ అపజయలను అందుకుంటు వస్తున్నాయి.

దానితో ఈమె క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అలాంటి సమయంలోనే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ కాంబో మూవీ లో హీరోయిన్గా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఇష్క్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి నితిన్ హీరోగా విక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు , అన్ని ఓకే అయితే నితిన్ , విక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నితిన్ ఈ మధ్య కాలంలో హీరోగా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే పూజా హెగ్డే కి కూడా వరుసగా అపజయాలు ఉన్నాయి. మరి ఈ కాంబోలో మూవీ సెట్ అయితే నితిన్ , పూజ హెగ్డే కు ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: