
ఈ సినిమాలో సత్యరాజ్ కూతురు ప్రీతి పాత్రలో శృతి హాసన్ కనిపించగా సత్యరాజ్ ఫ్రెండ్ పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చిన సీన్ నుంచి ప్రతి సీన్ వేరే లెవెల్ లో ఉంది. టాప్ రేంజ్ లో ఈ సినిమా ఉండగా లోకేశ్ కంగరాజ్ తన ప్రతిభతో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అయితే ఖాతాలో వేసుకున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
సినిమాలో గెస్ట్ రోల్స్ ఎక్కువగా ఉండగా ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉండేలా లోకేష్ కనగరాజ్ జాగ్రత్తలు తీసుకున్నారు. రజనీకాంత్ స్నేహితుడి పాత్రలో ఉపేంద్ర కనిపించగా ఆయన పాత్ర సైతం ఆకట్టుకునేలా ఉంది. క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీని వేరే లెవెల్ లో ప్లాన్ చేశారు. సినిమాలో ఇప్పటికే చుసిన క్యామియోలతో పాటు కొత్త క్యామియోలు కూడా ఉండటం సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.
కూలీ సినిమా బాక్సాఫిస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. కూలీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. కూలీ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఐతే ఉందని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం కూలీ సినిమా సక్సెస్ రజనీకాంత్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.