
కానీ ఇప్పుడు ఆయన కూలీ సినిమాలో చేసిన పాత్ర మాత్రం పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉంది. ఇది నాగార్జున చేసిన ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. కూలీలో ఆయన చేసినది పక్కా విలన్ పాత్ర. అది చాలా భయం పుట్టించేలా ఉంది. ఒక పెద్ద స్టార్ సీనియర్ హీరో ఈ విధంగా ఫుల్ లెంగ్త్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తే, ఫ్యాన్స్ కచ్చితంగా ఊరుకోరు. కానీ ఫ్యాన్స్ ఊరుకునేలా, అద్భుతంగా చేశారు నాగార్జున. నిజజీవితంలో వ్యక్తులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా..? అని ఆలోచింపజేసేలా ఆయన నటించారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్స్ అయినా నటించగలగాలి, అప్పుడే స్టార్స్ ఎదుగుతారు అన్న విషయాన్ని నాగార్జున మరోసారి ప్రూవ్ చేశారు. కూలీలోని సైమన్ పాత్రకు నాగార్జున తప్ప వేరే ఏ హీరో కూడా సూట్ కాదని చెప్పడంలో సందేహం లేదు. ఈ పాత్రకు ఆయన జీవం పోశారు.
రజనీకాంత్ పాత్ర ఎంత హైలైట్ అయిందో, సైమన్ పాత్ర కూడా అంతే హైలైట్‌గా మారింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే, కుబేరలో దీపక్ రాజ్ గా ఆయన చేసిన పర్ఫామెన్స్ కన్నా, కూలీలో సైమన్‌గా ఆయనకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ. ఖచ్చితంగా ఇది నాగార్జున కెరీర్‌లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగార్జున డ్యూయల్ షేడ్స్‌ని ఆస్వాదిస్తూ అభినందిస్తున్నారు..!!