
మరి స్టార్ హీరోలు కూడా అలాగే చేస్తారా? సినిమా ఫ్లాప్ అయితే, “మా తదుపరి సినిమా హిట్ అవ్వాలి దేవుడా” అంటూ ప్రత్యేక పూజలు చేయిస్తారా? అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం సినిమాల కోసమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉంటారా అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ప్రభాస్‌కి ఇష్టదైవం ఎవరు? ఆయనకు కష్టం వచ్చినా, బాధ కలిగినా మొదటగా ఎవరిని ఆశ్రయిస్తారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రభాస్ ఫేవరెట్ దేవుడు శివుడట. కృష్ణంరాజు గారి కుటుంబం మొత్తం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తారని, అందుకే చిన్నప్పటి నుంచి ప్రభాస్‌కూ శివుడంటే ప్రత్యేకమైన భక్తి, ఆసక్తి ఉందని చెబుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఎప్పుడూ గుడికి వెళ్లిన ఫొటోలు లేదా వీడియోలు బయటకు రాలేదు. ఆయన తానెంత కష్టంలో ఉన్నా, ఆ కష్టాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. బదులుగా సమస్యను తనంతట తాను ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తారు. పలు సినిమాలల్లో ప్రభాస్ శివుడ్ అంశాలను ఎక్కువుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభాస్‌కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.