
జాన్వీ కపూర్ ఆ ట్రోల్స్ గురించి అవును నేను మలయాళీ అమ్మాయిని కాదని మా అమ్మ కూడా మలయాళీ కాదని ఆమె పేర్కొన్నారు. కానీ కేరళ సంస్కృతి విషయంలో నేనెప్పుడూ ఆసక్తి చూపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రధానంగా మళయాళ సినిమాలకు నేను అభిమానినని పరమ్ సుందరి సినిమాలో మలయాళీ అమ్మాయిగానే కాదని తమిళ అమ్మాయిగా కూడా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఇది వినోదాత్మక కథ అని ఆమె వెల్లడించారు.
ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు. ఢిల్లీ యువకుడు, కేరళ యువతి మధ్య ప్రేమ కథకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ సుందరి దామోదరం పిళ్ళై పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ లో జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జాన్వీ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.