
అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో హాట్ అప్‌డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త బయటపడింది. మొదట ఆయన గెస్ట్ రోల్‌లో మాత్రమే ఉంటారని భావించగా, తాజా సమాచారం ప్రకారం ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అదీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. వెంకటేష్ పోషించే ఈ రోల్ చిరంజీవి – నయనతారలను కలిపే కీలక పాత్ర అని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని కూడా సినీ వర్గాలు అంటున్నాయి.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వెంకటేష్ ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా, పూర్తిగా స్నేహం కోసం, ప్రేమ కోసం నటిస్తున్నారని తెలుస్తోంది. అలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వెంకటేష్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారని టాక్. ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది. ఆ ప్రాజెక్ట్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక గెస్ట్ రోల్ చేయబోతున్నారని టాలీవుడ్ టాక్. ఈ వార్త విన్న వెంటనే అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. త్రివిక్రమ్ ఇది పూర్తిగా వెంకటేష్‌కి సర్ప్రైజ్‌గా ప్లాన్ చేశారని, చిరంజీవి కూడా పెద్దగా ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారని సమాచారం.
ఇక ఈ న్యూస్ బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో హల్‌చల్ మామూలుగా లేదు. త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఇప్పుడు వెంకటేష్‌కి ఒక షాకింగ్ హ్యాపీ న్యూస్గా మారింది. అభిమానులు మాత్రం దీనిని నాటిగా మాట్లాడుకుంటూ –
“వెంకటేష్ చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే, చిరంజీవి వెంకటేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకరికి ఒకరు గిఫ్ట్‌లు ఇచ్చి, రిటర్న్ గిఫ్ట్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనితో సోషల్ మీడియాలో ఓకే టాపిక్ – చిరు – వెంకీ రిటర్న్ గిఫ్ట్ ఎక్స్చేంజ్. ఇద్దరు సూపర్‌స్టార్లు ఇలా ఒకరికి ఒకరు సర్ప్రైజ్ ఇస్తుండటంతో, అభిమానులు మాత్రం డబుల్ థ్రిల్‌లో ఉన్నారు.