అక్కినేని నాగార్జున కి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. రీసెంట్ కూలీ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఈ విషయాలన్నీ బయట పెట్టారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటించిన 7 సినిమాలు కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదని,ఆ తర్వాత నేను ఎంచుకున్న సినిమాల వల్లనే నా కెరియర్ పై నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటూ కొన్ని విషయాలు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి నాగార్జున సినిమాల్లో తండ్రి పేరుతో హీరోగా ఏమీ కొనసాగలేదట.హీరోగా పేరు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డారట. అలా ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి వల్ల చిత్రహింసలు అనుభవించారట. ఇక విషయంలోకి వెళ్తే..నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఆఖరిపోరాటం సినిమా అందరూ చూసే ఉంటారు. 

అయితే ఈ సినిమా గురించి కూడా రీసెంట్ గా నాగార్జున మాట్లాడారు. ఆఖరిపోరాటం సినిమాలో నేను కేవలం ఒక బొమ్మలాగా మాత్రమే నటించానని, ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావు గారికి,శ్రీదేవి గారికే ఇస్తానని, ఆ సినిమాలో డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాను.కానీ శ్రీదేవికి ఉన్న క్రేజ్ వల్లే సినిమా హిట్ అయింది అని చెప్పారు.అయితే ఈ సినిమా షూటింగ్లో  నాగార్జున కి కొన్ని వింత అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం నాగార్జునని లావు పెరగమని రాఘవేంద్రరావు చెప్పారట. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి నాగార్జున లావు పెరగకపోవడంతో చివరికి చేసేదేమీ లేక నాగార్జున వేసుకునే బట్టల్లో అంటే ప్యాంట్ లో షర్టులో స్పాంజ్ పెట్టి కుట్టించారట.ఇక ఈ బట్టలు వేసుకోవడంతోనే నాగార్జున కాస్త బొద్దుగా ఉన్నట్టు కనిపించారు.

అయితే ఎండలో ఆ బట్టలు వేసుకుని షూటింగ్ చేసిన సమయంలో నాగార్జునకి చిరాకు పుట్టించి ఈ ఎండలో ఇవి నేను వేసుకోలేను అని చెప్పారట. కానీ లావు అవ్వమంటే అవ్వలేదు ఇప్పుడు ఈ బట్టలు కూడా వేసుకోనంటే ఏం చేయాలి.. కచ్చితంగా నువ్వు షూటింగ్ అయిపోయే వరకు ఈ బట్టలు వేసుకోవాల్సిందే అని కండిషన్ పెట్టారట. ఇక అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున రాఘవేంద్రరావు మాటకి ఎదురు చెప్పలేకపోయారట. అలా చేసేదేమీ లేక ఆ బట్టల తోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారట. ఇక వీరి కాంబోలో వచ్చిన జానకి రాముడు సినిమా కోసం కూడా నాగార్జున బొద్దుగా కనిపించడం కోసం రాఘవేందర్రావు జుబ్బాల లోపల స్పాంజ్ పెట్టి కుట్టించారట. అలా నాగార్జున, రాఘవేంద్రరావు గారు పెట్టిన కండిషన్స్ వల్ల ఆ సినిమా షూటింగ్స్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: