మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పేరు. అఫ్కోర్స్, ఈ ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి రాబట్టిన వ్యక్తి కూడా ఆయనే. చిరంజీవి ఎంతో కష్టపడి, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగి, తనకే కాకుండా తన కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో సృష్టించారు. నేటి రోజుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ అందరూ, ఏదో ఒక విధంగా ఆయన ప్రభావం వల్లే రాణిస్తున్నారు అని చెప్పొచ్చు. చిరంజీవి లాంటి మహానటుడిని చూసి, ఆయన దారి అనుసరించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరికీ ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి ఎప్పుడూ ఒక స్పెషల్ రిస్పెక్ట్, అప్రిసియేషన్ దక్కుతుంది.


ఇవి పక్కన పెడితే, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.  మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారికి ఇష్టమైన హీరో ఎవరు? సాధారణంగా సినీ పరిశ్రమలో ఉన్న స్టార్‌లందరికీ ఒక ఫేవరెట్ సెలబ్రిటీ ఉంటారు. కానీ సురేఖ గారి పరిస్థితి కొంచెం స్పెషల్. ఎందుకంటే, ఆమె ఇంట్లోనే భర్త చిరంజీవి, కొడుకు రామ్ చరణ్, మేనల్లుడు అల్లూ అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఒక రేంజ్‌లో స్టార్ హీరోలు ఉన్నారు. అయినా కూడా, ఆమెకు ఎవరు ఎక్కువగా నచ్చుతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం.." సురేఖ గారి ఫేవరెట్ హీరో ఎవరో కాదు, "నటభూషణుడు శోభన్ బాబు గారు". ఒకప్పుడు శోభన్ బాబు గారి సినిమాలు, ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్ అన్నీ సురేఖ గారికి అమితంగా నచ్చేవి. ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నా కూడా, తన భార్యకు ఇష్టమైన హీరో మాత్రం శోభన్ బాబునే అని చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, మళ్లీ మళ్లీ షేర్ చేస్తున్నారు.



ఇక ప్రస్తుతం చిరంజీవి విషయానికి వస్తే  ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి ఆయన కమిట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను చాలా స్పీడ్‌గా పూర్తి చేయడానికి మెగాస్టార్ బిజీ బిజీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.  రెండో హీరోయిన్ గా క్యాధరిన్ ని అనుకుంటున్నారట.  దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: