
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. రూ .200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .95 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బడ నిర్మాత ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
నైజాంలో రూ .40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ .45 కోట్లు, సీడెడ్ లో రూ .15 కోట్ల రూపాయల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మొదటి భాగం భారీ సక్సెస్ కావడంతో ఆడియన్స్ కూడా కాంతారా చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు, పోస్టర్స్, గ్లింప్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అందుకే ప్రీక్వెల్ కు ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంతార మొదటి భాగం తెలుగు రాష్ట్రాల రూ .2 కోట్లకు పైగా బిజినెస్ జరగగా రూ.58.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రూ.30 కోట్ల రూపాయల వరకు షేర్ రాబట్టింది. గీతా ఆర్ట్స్ సంస్థకు భారీ లాభాలని చేపట్టింది. మరి కాంతారా చాప్టర్ 1 కి బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే రూ .170 కోట్ల రూపాయలను గ్రాస్ కలెక్షన్స్ చేయాల్సి ఉంది. మరి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందొ చూడాలి .