తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం తారక్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తారక్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఈయన హిందీ సినిమా అయినటువంటి వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసింది. ఇది ఇలా ఉంటే తారక్ తాజాగా ఓ నివేదిక ప్రకారం ఏకంగా మోదీ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నాడు. అది ఎందులో అనుకుంటున్నారా ..? ఆ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో మంచి క్రేజ్ కలిగిన ప్లాట్ ఫామ్ ఎక్స్. ఎక్స్ లో అనేక మంది అనేక విషయాల గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వారు ప్రతి నెల కూడా ఆ నెలలో ఎక్కువ మంది ఎవరిని సెర్చ్ చేశారు అనే దానికి సంబంధించిన జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆగస్టు నెల కు సంబంధించిన జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేసింది. అందులో భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన తర్వాతి స్థానంలో తారక్ స్థానాన్ని దక్కించుకున్నాడు ఇలా మోదీ తర్వాతి స్థానాల్లో తారక్ నిలిచాడు. దానితో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తారక్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: