ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే. “ఒకే సమయంలో రిలీజ్ అయిన రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒకటి ఘోర ఫ్లాప్ అయితే, మరొకటి ఎందుకు సూపర్ హిట్ అయింది?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకూ బాగా తెలిసినట్లుగానే, ఇటీవలి కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘లోక’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. డైరెక్టర్ డొమెరిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటి కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటించింది. హీరో సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మలయాళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మంచి కంటెంట్, సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చినందుకు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.


‘లోక’ ప్రత్యేకత ఏమిటంటే, ఇండియన్ సినిమాల్లో చాలా అరుదుగా చూసే సూపర్ ఉమెన్ స్టోరీని ఇది ముందుకు తీసుకువచ్చింది. సాధారణంగా ఇలాంటి కథలను మనం హాలీవుడ్ సినిమాల్లో లేదా మార్వెల్ స్టూడియోస్ ప్రొడక్షన్స్‌లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఒక ఇండియన్ దర్శకుడు ఈ తరహా సబ్జెక్ట్‌ను బలంగా ప్రెజెంట్ చేయడం వల్ల ఈ సినిమా అందరి మనసులను దోచుకుంది. అదే సమయంలో, చాలా అంచనాల మధ్య విడుదలైన అనుష్క – క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘ఘాటి’ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అనుష్క, క్రిష్ కాంబో అంటే ప్రేక్షకులకు ఎప్పటినుంచో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. అయితే ఈ సినిమాకు వచ్చిన ఫలితం మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాన్సెప్ట్ కొత్తదైనా, కథనం ప్రేక్షకులను ఎక్కడా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేదు. కాబట్టి సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు.



నెటిజన్లు కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. “అనుష్క తనకు వచ్చే మంచి ప్రాజెక్టులు తీసుకుని ముందుకు వెళ్లాలి కానీ ఎందుకు ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్స్‌కి ఓకే చెబుతోంది?”, “ఇలాంటి ఫ్లాప్స్‌ని అంగీకరించడం అంటే తన ఇమేజ్‌కే నష్టం” అని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరైతే “దరిద్రం అంటే ఇదే కదా... మంచి సినిమాలు వదిలేసి ఇలాంటి ప్రాజెక్టులు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది” అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.



ఇక ఈ పోలిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. “జోనర్ వేరైనా, రెండూ లేడీ సెంట్రిక్ సినిమాలే కదా... మరి ఒకటి సక్సెస్ అవుతూ మరొకటి ఎందుకు విఫలమైంది?” అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా విజయం అనేది కేవలం స్టార్ పవర్ మీద ఆధారపడదు. బలమైన కథ, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, ఎమోషనల్ కనెక్ట్, మ్యూజిక్, టెక్నికల్ స్టాండర్డ్స్ – ఇవన్నీ కలిస్తేనే హిట్ అవుతుంది అని ఈ రెండు సినిమాల ఫలితం రుజువు చేసింది. అనుష్క విషయంలో మాత్రం అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉండటమే కాకుండా, ఈ సినిమా నుండి వారు వేరే స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశించారు. కానీ క్రిష్ ఎంచుకున్న కథనం ప్రేక్షకుల మనసును తాకలేకపోయింది. దాంతో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం సహజం. ఇక కళ్యాణి ప్రియదర్శిని నటించిన ‘లోక’ మాత్రం అన్ని వయసుల ప్రేక్షకులను కనెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. మొత్తానికి, ఈ రెండు సినిమాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఓ పెద్ద డిబేట్‌కి దారితీస్తున్నాయి. “హిట్, ఫ్లాప్ అనేది స్టార్ పవర్ మీద ఆధారపడదని, కథే రాజు” అని ఈ సంఘటన మరొక్కసారి రుజువు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: