టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ తనదైన సత్తా చాటుతున్న హీరోయిన్స్లో స్త్రీ లీలా మొదటి పొజిషన్లో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఇండస్ట్రీ నాదే అంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ  . ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ , హిందీలలో సినిమాలు చేస్తుంది . అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈమెపై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి . బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి .


అందుకు తగ్గట్లుగానే పలుమార్లు కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు ఆద్యం పోసినట్లు అయ్యింది . ఇక తాజాగా వీళ్ళిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం ప్రెసెంట్ సెన్సేషన్ గా మారింది . శ్రీ లీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పని చేసింది . కానీ కార్తీక్ తో కాస్త చనువుగా ఉంటున్నట్లు కనిపిస్తుంది . ఎందుకంటే కొన్ని రోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తీక్ ఇంట్లో చిన్న పార్టీ ‌ నిర్వహించుకున్నారు ‌. ఇందులో కార్తీక్ ఫ్యామిలీతో పాటుగా శ్రీ లీలా కూడా కనిపించింది . అదేవిధంగా కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తీక్ తల్లి .‌.. తనకు డాక్టర్ చదువుకున్న కోడలు కావాలంటూ తెలిపింది .


శ్రీ లీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసిందన్న విషయం మనకు తెలిసిందే . కార్తీక్ తల్లి శ్రీ లీలానే తన కోడలుగా రావాలన్నా ఉద్దేశంతోనే ఇలా మాట్లాడారా అనే సందేహణలు వ్యక్తం అవుతున్నాయి . ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ముంబైలోని కార్తీక్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుపుకోగా .. అందులో శ్రీ లీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరయ్యారు . అయితే ఇది పార్టీ గేదరింగ్ లేదంటే తమ రిలేషన్ ని కార్తీక్ మరియు శ్రీ లీలా పరోక్షంగా బయటపెడుతున్నారా అనే విషయాలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: