
తెలుగులో జాదుగాడు, ఈడోరకం ఆడోరకం, స్పీడున్నోడు వంటి చిత్రాలలో కనిపించింది. అయితే తెలుగులో హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది సోనారిక. చివరిగా 2022లో ఈమె నటించిన హిందుత్వ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాతే తన ప్రియుడు ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుపొందిన వికాస్ పరశార్ తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నది. అలా ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఈ ఏడాది జనవరిలో వివాహ బంధంలో అడుగుపెట్టారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కొన్ని నెలలులోపే గుడ్ న్యూస్ తెలిపింది.
తాజాగా తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తూ తన భర్తతో కలిసి దిగిన కొన్ని బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలిసిన అటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా సోనారిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే కేవలం నటించింది ఇమే ఐదారు సినిమాలలో అయినప్పటికీ తన పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే పాత్రలోనే నటించింది. మరి రాబోయే రోజుల్లో మళ్లీ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.