టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కిష్కిందపురి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే ఇంకా ఎన్ని కలెక్షన్లను రాబట్టాలి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.8 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 55 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ఐదు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.13 కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సిస్ లలో కలుపుకొని 1.40 కోట్ల కలెక్షన్లు  దక్కాయి. ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 8.53 కోట్ల షేర్ ... 16.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 1.47 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస నటించిన సినిమా విజయాన్ని సాధించి చాలా కాలం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కిష్కింధపురి సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి విజయం దక్కే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss