సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు తక్కుతాయో వారికి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కుతో ఉంటుంది. అలాగే స్టార్ హీరోల సినిమాలలో , అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇక చాలా తక్కువ మంది కి మాత్రమే పెద్దగా విజయాలు లేకపోయినా స్టార్ హీరోల సినిమాలలో , అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇలా ప్రస్తుతం పెద్దగా విజయాలు లేకపోయినా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను ఓ బ్యూటీ దక్కించుకుంటుంది. ఇంతకు ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి నిధి అగర్వాల్.

ఈమె నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈమె ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. 

మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈమెకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత కూడా ఈమె నటించిన ఏ సినిమా బాక్సా ఫీస్ దగ్గర విజయం సాధించలేదు. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే  విడుదల అయింది. ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరో గా నటిస్తున్న రాజా సాబ్ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఈమె ఏ రేంజ్ విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇలా ఈమెకు పెద్దగా విజయాలు లేకపోయినా , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు మాత్రం వరుసగా దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: