టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ, దిల్ రాజు పేరు మాత్రమే ఎక్కువుగా హైలెట్ అవుతుంది. ఆయన పేరు  చెప్పగానే అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఎందుకంటే, దిల్ రాజు ఏ పని చేయాలో కచ్చితంగా, సమయానికి తగ్గట్టు నిర్వర్తిస్తాడని అందరు  అనుకుంటారు. ఇకపుడు, మరోసారి అలాంటి నిర్ణయం తీసుకున్న దిల్ రాజు, సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారిపోయారు. దిల్ రాజు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటీ అనేది ఇప్పుడు చర్చకు తెచ్చారు. టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా నిలిచిన దిల్ రాజు, ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

గతంలో, ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో, కొందరు సోషల్ మీడియాలో దిల్ రాజును "ఆయన చాప్టర్ క్లోజ్" అంటూ, సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ట్రోల్ చేశారు. అయితే, దిల్ రాజు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, మళ్ళీ తన స్థానాన్ని మరల పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం, దిల్ రాజు చేతిలో విజయ్ దేవరకొండ సినిమా తప్ప, ఇతర పెద్ద స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ లేవు. కానీ ఇప్పుడు, ఆయన కోలీవుడ్ లో కొత్తగా పెద్ద స్థాయిలో ప్రాజెక్ట్ తీసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో సినిమా చేయాలనేది దిల్ రాజు నిర్ణయం అని టాక్ వినిపిస్తుంది.

అదే నిజం అయితే ఇది బిగ్  ప్రాజెక్ట్‌ అవుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ప్రస్తుతం, అజిత్ కుమార్ మరియు దిల్ రాజు మధ్య చర్చలు జరుగుతున్నాయట.  అన్ని డీటెయిల్స్ స్పష్టమైన తర్వాతే, ఫైనల్‌ నిర్ణయం తీసుకుని అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేస్తారట. ఈ నిర్ణయం వల్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఆసక్తితో, "ఈ కాంబోలో వచ్చే సినిమాకు దర్శకుడు ఎవరు అయి ఉంటారు?" అని రియాక్ట్ అవుతున్నారు. చూడాలి, దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకు ఎంత మేరకు ఆయనకి సక్సెస్ ఇస్తుంది అనేది..? ప్రసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్, కోలీవుడ్ ఇందస్ట్రీలో బాగా హాట్ గా ముందుకు వెళ్తుంది...??


మరింత సమాచారం తెలుసుకోండి: