
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక ఆర్మూళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం పెద్దగా ప్రమోషన్ లు చేయని విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై ప్రజలకి ఉన్న నమ్మకమే కాదు, కథ మరియు కంటెంట్ పై ఉన్న నమ్మకాన్ని కూడా ఇలా నిరూపించవచ్చు అనిసినీ ప్రముఖులు, అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. అయితే మరోక వర్గం మాత్రం సుజిత్ ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కొంత నెగ్లెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమాకి ఉన్న తారాగాణంతో సరైన ప్రమోషన్స్ జరిగి ఉంటే, సినిమాకి వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్ లో ఉండేది అని మాట్లాడుకుంటున్నారు.
హిందీ వెర్షన్కి ఇమ్రాన్ హష్మీ, తమిళ మార్కేట్ కి అర్జున్ దాస్ వంటి స్టార్ హీరోలను కూడా ఉపయోగించుకుని ఉంటే బాగుండేది అని వాళ్ళ అభిప్రాయం. ఈ సినిమాకు కనీస ప్రమోషన్స్ కూడా చేయలేదు చిత్ర బృందం. ఒక్క ఇంటర్వ్యూను కూడా లేకుండా సినిమా థియేటర్స్‌కి తీసుకెళ్ళడం ఇంకా హైలెట్ పాయింట్. దీని వల్ల ఓ మంచి గోల్డెన్ ఆఫర్ మిస్ అయ్యిందని ప్రేక్షకులు, మీడియా అంటున్నారు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రియాంక ఆర్మూళ్ మోహన్, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ విషయంలో ఏ విధమైన సపోర్ట్ అందకపోవడం ఓ మైనస్. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న కారణంగా బిజీ కాల్ షెడ్యూల్స్ కారణంగా ఇలా జరిగిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి కొద్ది సేపట్లో రిలీజ్ కానున్న “ఓ జి” సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుంది అనేది..??