పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీఏ  కూటమిలో భాగంగా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. అలాంటప్పుడు ఎన్డీఏ కి వ్యతిరేకపక్షం అయినటువంటి ఇండియా కూటమి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు అంటున్నారు ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు.ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ డైలాగ్ వార్ నడుస్తోంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ చేసిన పనే.. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన ఓజి మూవీకి సంబంధించి హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్నారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ని ఎన్నడూ చూడని విధంగా చాలా జోష్ తో ఈవెంట్ కి వచ్చారు.ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లిన తెలుపు రంగు బట్టలు వేసుకొని వెళ్లే పవన్ కళ్యాణ్ ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం ఆ సినిమాలో ధరించిన షర్ట్ ని పాయింట్ ని వేసుకొని చేతిలో కత్తి పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈయన మాస్ ఎంట్రీ కి  చాలామంది అభిమానులు ఫిదా అయ్యారు. అయితే అంత బాగానే ఉంది కానీ ఆ రెండు విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ని హేట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ అంటే అంతా చిన్న చూపా.. కనీసం శుభాకాంక్షలు అయినా తెలుపలేదు అంటూ మండి పడుతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ప్రజలు ఫైర్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ సమయంలోనే హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్నారు. తెల్లవారితే ఎంగిలిపూల బతుకమ్మ.అలాంటిది పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈవెంట్ పెట్టుకొని తెలంగాణ ఆడపడుచులందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయలేదు అంటూ కాంగ్రెస్ వాళ్లు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారు.

అలాగే అంత వానలో కూడా కట్టుదిట్టమైన భద్రత అందించిన తెలంగాణ పోలీసులకు చివర్లో పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపలేదని మండిపడుతున్నారు.తెలంగాణ అంటే అంత చిన్న చూపా కనీసం పండగ విషెష్ లేదు పోలీసులకు కృతజ్ఞతలు లేవు అంటూ మండిపడుతున్నారు.. అయితే కాంగ్రెస్ చేసే ఆరోపణలని పవన్ ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ప్రజలు అంటే గౌరవమే. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ  పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందు అది చూసుకొని పోస్టులు పెట్టండి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: