మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించిన ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ సరైన విజయాన్ని అందుకోలేదు. ఈయన ఆఖరుగా విజయం అందుకొని కూడా చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది.

ఓ వైపు మాస్ జాతర సినిమాలో హీరో గా నటిస్తూనే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న రవితేజ మరో క్రేజీ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు అనే పేరు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజమూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ దర్శకుడు రవితేజ కు ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో రవితేజ ఈ దర్శకుడి దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే రవితేజ కు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. శివ నిర్వాణ ప్రేమ కథ చిత్రాలను తీయడంలో స్పెషలిస్ట్. మరి వీరిద్దరి కాంబో లో మూవీ ఎలా ఉంటుందా అని జనాల్లో కూడా ఇప్పటి నుండే ఆసక్తి మొదలైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt