
అయితే ఈ చిత్రంలో డైరెక్టర్ కమ్ ,హీరోగా నటించిన రిషబ్ శెట్టి భార్య ప్రగతి కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. అయితే సినిమాకి వెళ్లినవారు అంతగా గమనించకపోవచ్చు !కానీ జాగ్రత్తగా గమనిస్తే కాంతార చాప్టర్ 1లో ఒక సన్నివేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన రథం సీన్లో రిషబ్ శెట్టి విరోచితంగా పోరాడే సమయంలో ఒక లేడీ ని కాపాడబోయే క్రమంలో కింద పడతారు. అయితే అక్కడ హీరో కాపాడిన లేడి పాత్రలోనే రిషబ్ శెట్టి భార్య ప్రగతి కనిపిస్తుంది.
అయితే ఈ సీన్లో కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించేది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే 2022లో విడుదలైన కాంతార సినిమాలో సినిమా ప్రారంభంలో రాజుకు భార్యగా పిల్లాడిని ఎత్తుకొని మరి కనిపిస్తుంది. ఇలా తన భర్త తెరకెక్కించిన బిగ్గెస్ట్ హీట్ చిత్రాలలో కూడా ప్రగతి భాగమయ్యింది. కన్నడ సినీ ఇండస్ట్రీలోని రిషబ్ శెట్టి పేరు మారుమోగుతోంది. మరి రాబోయే తన తదుపరిచిత్రం ఎలా ఉంటుందో అంటూ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. మరి కాంతార చాప్టర్స్ ను కంటిన్యూ చేస్తారా? లేకపోతే మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారా అన్న విషయం తెలియాలి. ప్రస్తుతం అయితే జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు.