సినిమా ఇండస్ట్రీలో చాలామంది నెపోకిడ్స్ ఉంటారు. కొంతమంది బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తారు. అయితే నెపోకిడ్స్ కి కాస్త ఎక్కువ అవకాశాలు వస్తాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. ఇదంతా పక్కన పెడితే కేవలం బ్యాగ్రౌండ్ ఉన్న వారు మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి వారి ఫ్యామిలీలో ఎవరో ఒకరిని సినిమాల్లోకి పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ తన స్టార్డంతో తన తమ్ముడిని కూడా సినిమాల్లోకి తీసుకువచ్చింది. ప్రేమదేశం సినిమాతో 90స్ కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు వినీత్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారడమే కాదు ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. 

అలా ఈయన ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.అయితే అలాంటి ప్రేమదేశం హీరో వినీత్ ఆ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు అనే సంగతి చాలా మందికి తెలియదు. మరి ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సీనియర్ నటి శోభన.. సీనియర్ నటి శోభన ఎంతోమంది సీనియర్ హీరోలతో నటించింది. అలా తెలుగు తమిళం మాలయాల కన్నడ భాషల్లో హీరోయిన్ గా రాణించింది. ఇక ఈమె సినీ కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం అంత బాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హీరోయిన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది.
ఇక చాలా సంవత్సరాల నుండి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 18 సంవత్సరాల తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD అనే మూవీలో మరియం అనే కీ రోల్ పోషించింది.అలా చాలా సంవత్సరాల తర్వాత శోభనని స్క్రీన్ మీద చూడడంతో చాలామంది ఆమె ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయారు.. శోభనకి వినీత్ తమ్ముడట.అలా వీరిద్దరి మధ్య అక్కా తమ్ముళ్ల అనుబంధం ఉంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక ప్రస్తుతం వినీత్ పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.ఇక శోభన చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మూవీ తో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: