
అయితే.. ఆ అందం, నటన, టాలెంట్—అన్ని ఉన్నా కూడా—స్టార్స్ ఎందుకు ఈమెను పలు సినిమా విషయాలల్లో రిజెక్ట్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు అందరికి బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. దానికి ప్రధాన కారణం ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ అని కొంతమంది అంటున్నారు. మృణాల్ ఎక్కువగా మీడియా లేదా జనాలతో మింగిల్ అవ్వదు. పబ్లిసిటికి దూరంగా ఉంటుంది. ఎక్కువుగా ఓపెన్ అప్ అవ్వదు. కానీ కొంతమంది స్టార్స్ మాత్రం తమ సినిమాల్లో ఎక్కువగా మింగిల్ అయ్యే బ్యూటీస్‌ని తీసుకోవడం వల్ల మృణాల్ వెనుక బడిపోతుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. రష్మిక మందన్నాను గమనిస్తే, ఆమె వరుసగా పెద్ద హిట్ ఇచ్చిన సినిమాల్లో భాగమై, తన ఖాతాలో మంచి ఫలితాలు సాధించుకుంది.
ఆమె మంచి మంచి ప్రొడక్షన్ హౌస్‌లతో సినిమాలు చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్. సోషల్ మాధ్యమాల్లో ఎప్పుడు కనిపించడం, మీడియా వ్యక్తులకి గౌరవంగా మాట్లాడడం, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చడించడం, తనకోసం ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడం—లాంటివి రష్మిక ని టాప్ హీరోయిన్ గా మార్చేశాయి. ఫలితంగా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతోంది. మరో వైపు, మృణాల్ ఠాకూర్ మాత్రం ఎక్కువగా సైలెంట్‌గా ఉండటం వల్ల, ఆమె టాలెంట్ బయటకు కనిపించడానికి తగిన అవకాశాలు రాలేదు. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం, రష్మికలో ఉన్న టాలెంట్ మృణాల్ కూడా చూపిస్తే, ఆమె రష్మిక స్థాయిని సులభంగా అందుకోవచ్చు. చూద్దాం మృణాల్ ఠాకూర్ ఈ విషయంలో ఏం చేస్తుందో..???