టాలీవుడ్‌లో స్టార్ హీరోలు అనగానే చాలా పేర్లు వినిపిస్తాయి. కానీ “మాస్ మహారాజా” అనే టైటిల్‌కి న్యాయం చేసే ఒక్క హీరో ఉంటే, ఆయన పేరు రవితేజ. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన టాలెంట్‌తోనే టాప్ రేంజ్‌కి చేరిన హీరో. తన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్లు కావడం ఆయన క్రేజ్‌కు నిదర్శనం. ఈ మధ్య కాలంలో హిట్ లేకున్నా, ఆయనకు ఉన్న పాపులారిటీ మాత్రం ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. మాస్ ఆడియన్స్‌కి అంటే రవితేజ సినిమాలు అంటే ఫెస్టివల్ అన్నట్టే! థియేటర్లలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటే అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇలాంటి రవితేజకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రవితేజతో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తారు. ఆయన ఎనర్జీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఫ్యాన్స్‌తో పాటు హీరోయిన్‌లు కూడా ఇంప్రెస్ అయిపోతారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే — ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు… ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసింది!


హీరోయిన్ ఎవరో తెలుసా? మరెవరో కాదు — నేషనల్ క్రష్ రష్మిక మందన్నే! సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, మొదట రవితేజ-త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో వచ్చిన “ధమాకా” సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకోవడం జరిగిందట. కానీ అప్పట్లో రష్మిక బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత కూడా మరో రెండు సినిమాల్లో రవితేజ సరసన నటించే అవకాశం రష్మికకు వచ్చినప్పటికీ, షెడ్యూల్ క్లాష్‌ల కారణంగా అవి కూడా మిస్ అయ్యాయని టాక్. దీంతో సోషల్ మీడియా లో “రవితేజని మూడుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్” అంటూ రష్మికపై ట్రోలింగ్ మొదలైంది.

 

రవితేజ అభిమానులు అయితే సోషల్ మీడియాలో రష్మికను టార్గెట్ చేస్తూ, “మా మాస్ అన్నతో నటించే అదృష్టం అందరికీ రాదు”,“నయనతార, ఇలియానా లాంటి వాళ్లు మా హీరోతో నటించి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు, నీకు ఇంకా సీన్ రావాలంటే టైమ్ పడుతుంది”
అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం “ఇది అంతా అపార్థం, రవితేజకు ఆమెకు ఎలాంటి ఇష్యూలు లేవు. కేవలం టైమ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఆ ఆఫర్లు మిస్ అయ్యాయి” అని చెబుతున్నారు.ఏది ఏమైనా, రవితేజ మరియు రష్మిక స్క్రీన్‌పై ఒకసారైనా కాంబినేషన్‌గా వస్తే, అది ఎనర్జీ బాంబ్‌లా పేలుతుందనడంలో సందేహం లేదు. అభిమానులు కూడా ఇప్పుడు అదే ఆశతో ఎదురుచూస్తున్నారు — “మాస్ మహారాజా” రవితేజ మరియు “నేషనల్ క్రష్” రష్మిక మందన్న జంటగా ఎప్పుడైనా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తారా లేదా..? వేచి చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: