టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ రూపొందించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి” ఈ ఏడాది అత్యంత ఎగ్జైటింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌, మాస్ యాక్షన్ సీన్స్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమా అభిమానులను థియేటర్లలో పండగ మూడ్‌లోకి తీసుకెళ్లింది. రిలీజ్ రోజునుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.


ఇక తాజాగా “ ఓజి ” ఓటిటి రిలీజ్‌కు సిద్ధమవుతోందనే టాక్ ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓజీ అక్టోబర్ 23 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినా ఓజి అభిమానులు ఈ అప్‌డేట్‌తో ఉత్సాహంగా ఉన్నారు. ద‌ర్శ‌కుడు సుజీత్ స్టైలీష్‌గా రూపొందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్‌డ్ పాత్రలో కనిపించగా, ఆయన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి.


ప్రియాంక అరుళ్ మోహన్ గ్లామరస్ పాత్రతో ఆకట్టుకుంది. థమన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. థియేటర్స్‌లో ఘన విజయం సాధించిన “ఓజి” ఇప్పుడు ఓటిటి ప్రేక్షకుల కోసం సిద్ధమవుతుండటంతో, పవన్ అభిమానులు ఇంట్లోనే మరలా “పవర్ ఫెస్ట్”ను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అక్టోబర్ 23న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రానుందా లేదా అనేది అధికారిక ప్రకటనతోనే స్పష్టమవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: