ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని ప్రతిభ, నటన, వ్యక్తిత్వం కేవలం అభిమానుల కే కాదు అందరికి బాగా నచ్చేస్తుంది. ఆయన చూస్ చేసుకునే కంటెంట్‌లో కూడా స్పష్టంగా అర్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం తన సినిమాలను శ్రద్ధగా ఎంచుకుంటూ, వాటి ట్రైలర్లు, టీజర్లు, మొత్తం కంటెంట్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అతని నటనకు ఒక ప్రత్యేక స్టైల్ ఉంది, అది ప్రేక్షకుల హృదయాలకు చేరుతూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైట్ అవుతుంది. సినిమా హిట్ ఫట్ అనేది ఆయనకి అనవసరం. జనాలను ఎంటర్టైన్ చేసామా..? అన్నదే ఇంపార్టెంట్..!!


ఇటీవల, ప్రదీప్ రంగనాథ్ పై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, కిరణ్ అబ్బవరం ఈ సందర్భంలో తన అభిప్రాయాలను చాలా ప్రత్యేకంగా చెప్పాడు. దీంతో ఆ మాటలు ఫుల్ పాజిటివ్ గా ట్రెండ్ అయ్యాయి. ఇతరుల మాటల్లో ఉండే నెగిటివిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, తనదైన నిజాయితీతో తన భావాలను పంచుకుంటాడు కిరణ్ అబ్బవరం. ఇది కిరణ్ ఫ్యాన్స్‌కు బాగా ఆకట్టుకునే అంశంగా మారింది, ఎందుకంటే ఆయన మాటల్లో ఎల్లప్పుడూ నిజాయితీ ఉంటుంది. తాజాగా కిరణ్ అబ్బవరం తన నటించిన "కె ర్యాంప్" సినిమా ప్రమోషన్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో కిరణ్ కొన్ని సందర్భాల్లో  తన సినీ కెరియర్‌లో ఎన్నో నెహిటివ్ అనుభవాలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఆ నెగిటివిటీని అధిగమించి, ఇప్పుడు సానుకూలంగా, న్యూట్రల్ దృక్పథంతో మరింత మెప్పు పొందుతున్నట్లు కూడా తెలిపారు.



దీంతో ఆ మాటలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. దీని పై రియాక్ట్ అయ్యాడు కిరణ్. “తనకోసం సింపతి చూపించొద్దు. నా సినిమాలు, ట్రైలర్లు, టీజర్లు మీకు నచ్చితేనే సినిమాకు రండి. అది కాకుంటే, సింపతి కోసం రాకండి.” అంటూ తేల్చి చెప్పాడు. ఆయన నిజాయితీతో నిండిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిరణ్ అబ్బవరం పేరు పాజిటివ్‌గా మళ్లీ టృఎండింగ్గా మారింది. ఈ విధంగా నిజాయితీతో మాట్లాడుతూ, ఆయన అభిమానుల నమ్మకాన్ని మరింత పెంచుకుంటున్నాడు.  నిజాయితీతో మాట్లాడడం, పవన్ కల్యాణ్ తరహా హీరోల ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడానికి సహాయపడుతుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: