అయితే ఆ విమర్శలన్నింటికీ ఒక్కసారిగా ముగింపు పలికేలా, అందరి నోరులు మూయించేలా దీపికా ఇప్పుడు ఒక చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో మోటా సంస్థ ఇటీవల ఆవిష్కరించిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ) అసిస్టెంట్‌కు, భారతదేశం నుంచి వాయిస్ అందించిన మొట్టమొదటి సెలబ్రిటీగా దీపికా పదుకొనే నిలిచింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం పట్ల ఆమె గర్వంగా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “ఇది కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు, మన దేశం తరఫున గ్లోబల్ లెవెల్లో ఒక ప్రతినిధిత్వం,” అని ఆమె చెప్పింది. మోటా రూపొందించిన ఈ అసిస్టెంట్ టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఇన్‌పుట్‌లను కూడా అర్థం చేసుకొని, సహజమైన మానవ స్వరంలో మాట్లాడగలదు. ఇకపై యూజర్లు స్నేహితుడితో మాట్లాడినట్లు దీపికా స్వరంతో మనం మాట్లాడగలం..వినగలం..పక్కాగా చెప్పాలి అంటే దీపిక ఇక మన ఫ్రెండ్ అయిపోయిన్నట్లే.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రముఖులు తమ వాయిస్‌లను ఈ టెక్ సిస్టమ్‌కి అందించారు. అయితే భారత్ నుండి అలాంటి అవకాశం దక్కిన ఏకైక స్టార్ సెలబ్రిటీగా దీపికా పదుకొనే చరిత్ర సృష్టించింది.దీంతో సోషల్ మీడియాలో నిన్నమొన్నటివరకు ఆమెను విమర్శించినవాళ్లు ఇప్పుడు షాక్‌లో పడిపోయారు. చాలా మంది అభిమానులు, నెటిజన్లు “ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి..! మీరు తిట్టిన అదే దీపిక ఇప్పుడు ప్రపంచానికి గర్వకారణం అయ్యింది” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.ఈ ఘనతతో మరోసారి దీపికా పదుకొనే గ్లోబల్ లెవెల్లో తన స్థాయి ఏంటో నిరూపించుకుంది. ఆమె సాధన ఇప్పుడు భారతీయ సినీ రంగానికి ఒక గర్వకారణం, భవిష్యత్తులో మరిన్ని భారతీయ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచే ఘనతగా మారింది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి