
ఇప్పుడు తండ్రి ఏడాది మసకం పూర్తయిన నేపథ్యంలో, పెద్దల నిర్ణయంతో రోహిత్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. అందుబాటులోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 30న నారా రోహిత్ – శిరిషల వివాహం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇరువురు కుటుంబాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
తెలుసుతున్న వివరాల ప్రకారం –
అక్టోబర్ 27న మెహందీ వేడుక,
అక్టోబర్ 28న సంగీత్ సెరిమనీ,
అక్టోబర్ 29న పసుపు వేడుక,
మరియు అక్టోబర్ 30న ప్రధాన వివాహం జరగబోతోంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి సంబరాలు వైభవంగా సాగబోతున్నాయి. ఈ వేడుకలకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఈ వివాహ కార్యక్రమాలన్నీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, లోకేష్ కుటుంబం సక్రమంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.హైదరబాద్ లో గ్రాండ్‌గా జరగనున్న ఈ పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అతిథుల జాబితా కూడా సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ ఇప్పటికే వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ వర్గాలు, రాజకీయ వర్గాలూ నారా రోహిత్ – శిరీష జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది జరిగే అత్యంత ప్రతిష్టాత్మక వివాహంగా నారా రోహిత్ పెళ్లి నిలవనుంది అనడంలో సందేహమే లేదు.