బాలీవుడ్ నటుడు.. నిర్మాత.. దర్శకుడు.. అయినటువంటి కరణ్ జోహార్ ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా బీటౌన్ లో హాట్ టాపిక్ గానే ఉంటారు.అయితే అలాంటి నిర్మాత తాజాగా జాన్వీ కపూర్ తో కలిసి టూ మచ్ టాక్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ టాక్ షో కి హోస్టులుగా బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా, కాజోల్  చేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ఉండే టాక్ షోలలో ఎన్నో బోల్డ్ అంశాలు బయటికి తీస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కరణ్ జోహార్ ఏదైనా టాక్ షో కి వచ్చారంటే చాలు ఆయన చాలా అసభ్యకర కామెంట్లు చేస్తూ చాలామందికి విసుగు తెప్పిస్తారు.చాలా బోల్డ్ గా మాట్లాడుతుంటారు. అయితే తాజాగా ఈ షోలో 26 ఏళ్లకే నేను నా వర్జినిటీని కోల్పోయాను. మీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే అంటూ మాట్లాడి సంచలనం సృష్టించారు. 

ఇక విషయంలోకి వెళ్తే.. టూ మచ్ టాక్ షోలో జాన్వీ కపూర్ కరణ్ జోహార్ ని ప్రశ్నిస్తూ.. మీ జీవితంలో ఉన్న అతిపెద్ద అబద్ధం.. స్కాండలస్ ట్రూత్ ఏదైనా ఉందా చెప్పండి అని అడగగా.. నా జీవితంలో ఉన్న స్కాండలస్ ట్రూత్ నేను 26 ఏళ్లకే నా వర్జినిటీని కోల్పోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు నీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే వర్జినిటీని కోల్పోయాను అని కరణ్ జోహార్ ఆన్సర్ ఇవ్వడంతో జాన్వీ కపూర్ వెంటనే చెవులు మూసుకుంది. దాంతో ట్వింకిల్ ఖన్నా,కాజోల్ ఇద్దరు నవ్వుకుంటూ కొంపదీసి బోనీ కపూర్ తో కాదు కదా అని ఫన్నీగా రియాక్ట్ అవ్వడంతో ఇప్పుడు నేను చెప్పింది బిగ్గెస్ట్ అబద్ధం అంటూ కూల్ గా చెప్పి జాన్వీ కపూర్ కి ఊరట కలిగించారు

. అలా కరణ్ జోహార్ నేను చెప్పింది పెద్ద అబద్ధం అని అనడంతో జాన్వీ కపూర్ కూడా హమ్మయ్య అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదేం వింత ప్రశ్నలు.. ఇవేం వింత సమాధానాలు అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కరణ్ జోహార్ అంటే ఈ లెవెల్ లో బోల్డ్ నెస్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: