బాలీవుడ్‌లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న జాన్వి, ఇప్పుడు తన దృష్టిని దక్షిణ భారత చిత్ర పరిశ్రమ వైపు మళ్లించింది. “దేవర” అనే భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం దొరకడం ఆమె కెరీర్‌లో ఓ కీలక మలుపుగా మారింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ మాత్రం “ఓకే-ఓకే” స్థాయిలోనే నిలిచిపోయింది. హిట్ రేంజ్‌లోకి చేరకపోవడంతో జాన్వి ఆశించినంత ఫలితం అందలేదు. ఇప్పుడు “దేవర 2”లో ఆమె స్థానంలో మరో నటి ని తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో జాన్వి ఉండకపోవడం వెనుక కారణాలు ఏమిటి అనే దానిపై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.
ఇక జాన్వి కపూర్ ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రాజెక్ట్ రామ్ చరణ్‌తో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమా. ఇది ఆమె కెరీర్‌లో అత్యంత పెద్ద అవకాశం అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే, ఆమె సౌత్‌లో తన స్థానం పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన లీక్ ఫోటోలు, బిహైండ్ ద సీన్స్ వీడియోలు—అన్ని చరణ్ పైనే ఉన్నాయి. దీంతో జాన్వి పాత్ర పెద్దగా ఏం ఉండదు అన్న వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. జాన్వీకి ఇది ఘోర అవమానం అంటున్నారు ఫ్యాన్స్. తల్లి శ్రీదేవి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ..ఆ వారసురాలికి ఇండస్ట్రీలో ఈ రీతిగా ఉండటం.. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా జాన్వి కెరీర్‌కి పెద్ద సవాల్‌గా మారింది. ఇక రాబోయే రోఝుల్లో కమిట్ అయ్యే సినిమా హిట్ కొట్టి తనను తాను నిరూపించుకోవడమే జాన్వి ముందున్న ఏకైక లక్ష్యం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి