కేవలం ఒక్క వీడియోతో సెండ్ చేసి ఓవర్ నైట్ కే స్టార్ అయిపోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.ఇండియాలో సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్లు రోజు రోజుకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వీటిని అదును చూసుకొని చాలామంది కంపెనీలు ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా వీరిదే కీలకమైన పాత్రగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫుడ్, ఫ్యాషన్, ఫైనాన్స్ ఎడ్యుకేషన్ వంటి రంగాలలో కూడా విస్తృతంగా కంటెంట్ ని ప్రచారం చేస్తున్నారు.. ఇందులో చాలామంది ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న నేపథ్యంలో చైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
చైనా దేశం డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియా రీల్స్ చేసేలా ఒక కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. తప్పుడు సమాచారం వ్యాప్తిని సైతం అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.. ముఖ్యంగా మెడిసిన్ లా, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి అంశాల పైన వీడియోలు చేయాలి అంటే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వారు డిగ్రీ చేసి ఉండాలని, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం కూడా వారి డిగ్రీ పైన వెరిఫై చేస్తుందట. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ ని పాటించని తరుణంలో వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ. 12 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించబోతున్నట్లు తెలిసింది చైనా సంస్థ. అలాగే ఈ రూల్స్ లో ఇన్ఫ్లు యెన్సర్ల లగ్జరీ లైఫ్ ను కూడా ప్రదర్శించకూడదట, అలాగే వారు నిర్వహించే మల్టీ ఛానల్ నెట్వర్క్ లను కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి అంటూ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి