బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా రవితేజ హీరోగా చేసిన భద్ర..ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.. అయితే ఈ సినిమా సమయంలో దిల్ రాజు బోయపాటి శ్రీను ని మోసం చేశారట.. మరి దిల్ రాజు ఏ విషయంలో బోయపాటి శ్రీను ని మోసం చేశారో ఇప్పుడు చూద్దాం.. బోయపాటి శ్రీను డైరెక్షన్ చేసిన భద్ర మూవీ అప్పట్లో అతిపెద్ద హిట్ అయింది. మొదటి సినిమానే అయినప్పటికీ బోయపాటికి ఈ సినిమా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. కమర్షియల్ హీరోగా రవితేజ కి కమర్షియల్ డైరెక్టర్ గా బోయపాటికి ఈ సినిమా గుర్తింపుని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా నిర్మించిన నిర్మాత దిల్ రాజు బోయపాటి శ్రీను ని ఓ విషయంలో మోసం చేశారట. అదే తన అనుమతి లేకుండానే ఇతర భాషలకి రీమేక్ రేట్స్ ని అమ్మడం. అయితే భద్ర సినిమా కథ పూర్తిగా బోయపాట శ్రీనుదే.. 

కానీ ఆయన అనుమతి లేకుండానే దిల్ రాజు మరో రెండు భాషల్లో రీమేక్ రైట్స్ ని అమ్మేశారట.కానీ రీమేక్ రైట్స్ ని అమ్మాలంటే కచ్చితంగా బోయపాటి సైన్ ఉండాలి. అయితే ఆ విషయంలో బోయపాటికి చెప్పకుండానే ఆయన సైన్ తీసుకోకుండానే దిల్ రాజు ఇతర భాషలకి రిమేక్ రైట్స్ అమ్మేశారట. ఇక ఈ విషయం తెలియగానే దిల్ రాజు దగ్గరికి వెళ్లి బోయపాటి శ్రీను అడగగా.. దిల్ రాజు ఇచ్చిన షాక్ కి బోయపాటి నోరు మూసుకొని సైలెంట్ గా వచ్చేసారట. దిల్ రాజ్ అడిగిన ప్రశ్న ఏంటంటే..

నీ ఫస్ట్ మూవీ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నీ సినిమాపై ఎలాంటి హక్కులు లేవు అని నేను ముందే చెబితే నువ్వు సినిమా చేసే వాడివా లేదా అని బోయపాటిని అడగగా..చేసేవాడిని సార్ అని అన్నారట.. అలా అయితే ఇప్పుడు అడుగు నీకు డబ్బులు కావాలా వద్దా ఆలోచించుకో ఒకసారి అంటూ ఆప్షన్ ఇచ్చారట.ఇక దిల్ రాజు మాటలకి బోయపాటి తగ్గి వద్దు సార్ అని వెళ్లిపోయారట. ఇక భద్ర సినిమా చేస్తున్న సమయంలో మంత్లీ 40 వేలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారట దిల్ రాజు. అలా సినిమా మొత్తం అయిపోయేసరికి దాదాపు 6,50,000 వరకు దిల్ రాజు బోయపాటికి రెమ్యూనరేషన్ గా ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: