ఇది నిజంగా అభిమానులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన జై భనుశాలి, ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకున్నారు. మొదట చిన్న చిన్న టీవీ షోలలో యాంకర్‌గా కనిపించిన ఆయన, తన హాస్య చాతుర్యం, సింపుల్ అటిట్యూడ్, హార్డ్‌వర్క్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ తర్వాత నటుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుని, టెలివిజన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. జై భనుశాలి వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయన మహి విజ్‌ను ప్రేమించి, ఎంతో హ్యాపీగా వివాహం చేసుకున్నారు. వారి జంటను టీవీ ఆడియన్స్ “మోస్ట్ లవబుల్ కపుల్” అని పిలిచేవారు. వీరిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలసి కనిపించేవారు. సోషల్ మీడియాలో కూడా వీరి ఫ్యామిలీ పిక్స్, ఫన్ వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉండేవి. జై–మహి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వారితో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని అందరూ అనుకున్నారు.

కానీ, గత కొన్ని నెలలుగా ఈ స్టార్ కపుల్ మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్ వినిపించింది. మొదట వీరు ఆ వార్తలను కొట్టిపారేశారు కానీ తర్వాత నుంచి సోషల్ మీడియాలో కలిసి కనిపించకపోవడం, ఫోటోలు షేర్ చేయకపోవడం, ఫ్యాన్స్ గమనించకమానలేదు. ఈ మధ్యకాలంలో వీరి గురించి పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు అందరూ అనుకున్నదే నిజమైంది — జై భనుశాలి మరియు మహి విజ్ విడాకులు తీసుకున్నారు. " ఐదు నిమిషాల క్రితమే ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడింది " అంటూ మహి విజ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేస్తూ, “చాలామంది నాకు కంగ్రాట్స్ చెబుతారని తెలుసు, కానీ ఇది సెలెబ్రేట్ చేసుకునే సమయం కాదు. విడాకులు అనేది విజయానికి సూచకం కాదు, అది ఒక విఫలత గుర్తు. నేను పెళ్లి అనే బంధాన్ని ఎంతో విలువైనదిగా భావించాను, కానీ కొన్ని పరిస్థితులు దాన్ని కొనసాగించనివ్వలేదు. ఇది నా జీవితంలో అత్యంత బాధాకరమైన నిర్ణయం” అని పేర్కొన్నారు.

జై భనుశాలి–మహి విజ్ కూతురు ఇటీవల జరుపుకున్న బర్త్‌డే ఫంక్షన్‌లో వీరు చివరిసారిగా కలసి కనిపించారు. అప్పటికే వీరిద్దరూ వేరుగా నివసిస్తున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం పిల్లల సంరక్షణ, ఖర్చులు మొదలైన అంశాలపై పరస్పర అంగీకారంతో నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ఈ వార్త వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “ఎందుకు స్టార్ సెలబ్రిటీలు ఇలా విడాకులు తీసుకుంటున్నారు?”, “ఫేమ్, లైమ్‌లైట్ వల్లేనా సంబంధాలు ఇంత త్వరగా విరిగిపోతున్నాయి?” అంటూ నెటిజన్లు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వీరి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలి అని చెబుతుంటే, ఇంకొంతమంది ఈ పరిస్థితి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి, జై భనుశాలి–మహి విజ్ విడాకుల వార్త టెలివిజన్ ఇండస్ట్రీలో పెద్ద షాక్‌లా మారింది. ఒకప్పుడు ఐడియల్ కపుల్‌గా భావించిన ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులకు నిజంగా చాలా బాధాకరం. వారి జీవితాలు మళ్లీ ప్రశాంతంగా, సంతోషంగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: