వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నటుడు నాగబాబు, స్టార్ హీరో రామ్‌చరణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల, అలాగే మెగా కుటుంబంలోని పలు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అందరూ కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించి, ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుక అనంతరం చిరంజీవి, నాగబాబు వంటి పెద్దలు కుటుంబ సమేతంగా శిరీష్–నయనిక జంటతో కలిసి ఫొటోలు దిగారు. ఇదే ఫంక్షన్ కి మొత్తం హైలెట్ గా మారింది. ఇక అల్లు శిరీష్ ఈ ఆనందవార్తను స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన అధికారిక ఖాతాలో నిశ్చితార్ధపు వేడుకలో తీసుకున్న అందమైన ఫోటోను షేర్ చేస్తూ, “నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నయనికతో ఉంగరాలు మార్చుకున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడూ మాకు లభించాలని కోరుకుంటున్నాను” అని రాశారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శిరీష్–నయనిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "మెగా కుటుంబంలో మరో కొత్త జంట," "శిరీష్ లైఫ్ పార్ట్‌నర్ చాలా అందంగా ఉంది," "అల్లు ఇంట్లో మరో వేడుకకు రెడీ అవుతున్నాం" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన పండుగ వేడుకల్లో కూడా నయనిక పాల్గొనడం అప్పటికే ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే చాలా మంది “ఇదేమో త్వరలో పెళ్లి శుభవార్త రాబోతోందేమో” అని ఊహించారు. ఆ ఊహ నిజమవడంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తానికి ఆనందం అంతకంతకూ పెరిగింది.
తెలుగులో అల్లు కుటుంబం అంటే సినీ రంగంలోనే కాకుండా వ్యాపార, సామాజిక రంగాల్లోనూ విశేష ప్రాధాన్యత ఉన్న పేరు. అల్లు అరవింద్ – గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించి ఇండస్ట్రీకి సరికొత్త స్థాయి తీసుకువచ్చారు. అల్లు శిరీష్ కూడా తన సొంత కృషితో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన ‘గౌరవం’, ‘కొత్త జంట’, వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇప్పుడు ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా అభిమానులు “శిరీష్‌కు జీవితంలో ఈ కొత్త ప్రయాణం ఆనందం, సాఫల్యం తీసుకురావాలి” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, పెళ్లి తేదీ, వేడుక వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.మెగా ఫ్యామిలీలో ఆనంద తరంగాలు ఊపందుకున్నాయి. అల్లు ఇంట్లో జరిగే ఈ శుభకార్యం కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో జరగబోయే ఈ పెళ్లి వేడుక తప్పక టాలీవుడ్ మొత్తానికి ఒక భారీ సెలబ్రేషన్గా మారడం ఖాయం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి