శ్రీలీల తాజాగా నటించిన మాస్ జాతర మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి ది ఎపిక్ మూవీ ఎఫెక్ట్ పడిందో లేక సినిమాలో కథ అంతగా లేకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ ప్రేక్షకులకు మాస్ జాతర  మూవీ మాత్రం అస్సలు నచ్చలేదు. దీంతో సినిమా చూసిన రవితేజ అభిమానులు సైతం సినిమా బాలేదని రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీలా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇకపై అలాంటివి చేయను..అందరు నన్ను అలాగే చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ శ్రీలీల ఇప్పటినుండి చేయనని చెప్పిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీలీల బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 లో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ ఐటెం సాంగ్ ద్వారా శ్రీ లీల దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. కానీ ఈ సినిమా వల్ల శ్రీలీలకు అలాంటి ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఎన్నో వచ్చాయట. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న శ్రీలీల ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.పుష్ప -2  మూవీ నాపై ఎంతో ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ ప్రాజెక్టులో భాగం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పటినుండి ఐటెం సాంగ్స్ అయితే చేయను పుష్ప-2 సినిమా తర్వాత ఐటెం సాంగ్స్ లో చేసే ఆఫర్ వచ్చింది.కానీ ఇప్పటినుండి అవి చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అందరూ నన్ను డాన్సింగ్ క్వీన్ గానే చూస్తున్నారు.నా డాన్స్ బాగుందని మెచ్చుకుంటున్నారు తప్ప నా నటనను మెచ్చుకోవడం లేదు. నేను డాన్సర్ ని మాత్రమే కాదు.

ఒక మంచి నటిని కూడా..అందరూ నా నటనను మెచ్చుకోవాలంటే ఈ ఐటెం సాంగ్స్ మానేయాలి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇకపై ఏ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయను అని శ్రీలీల అందరికి షాక్ ఇచ్చింది. అయితే శ్రీలీల చెప్పినట్లు అందరూ ఆమె డాన్స్ ని మెచ్చుకుంటారు తప్ప యాక్టింగ్ ని పొగిడిన దాఖలాలు ఎక్కువగా లేవు. అందుకే ఆమెకి కూడా డాన్సింగ్ క్వీన్ అనే ట్యాగ్ పోయి యాక్టింగ్ లో కూడా ఇరగదీస్తుంది అనే ట్యాగ్ రావాలనే  ఉద్దేశంతో ఇప్పటినుండి ఐటెం సాంగ్స్ చేయనని నిర్ణయించుకుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: