సినిమా పరిశ్రమ ఎప్పుడూ విజయాల వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. హీరోలు అయినా.. హీరోయిన్లు అయినా .. దర్శ‌కులు అయినా ఒక హిట్టు వచ్చిందంటే చాలు వారికి అవకాశాలు వెల్లువ‌లా వస్తు ఉంటాయి. అదే ప్రాబ్లమ్ వస్తే కెరీర్ స్పీడ్ బ్రేకర్ పడినట్టే ప్లాప్ సినిమాలు తర్వాత కొందరికి అవకాశాలు వచ్చినా ఎక్కువ మంది కెరీర్ కు బ్రేకులు పడుతూ ఉంటాయి. ప్లాపుల్లో ఉన్న దర్శకుడితో పని చేసేందుకు హీరోలు నిర్మాతలు ఇష్టపడరు. అలా టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న కొందరు... ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న పరిస్థితి. కృష్ణవంశీ పేరు చెప్పగానే క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తుకు వస్తారు. కుటుంబ కథా చిత్రాలను దర్శకుడుగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయనకు కెరీర్ పరంగా చివరిసారిగా ఎప్పుడు 2007లో వచ్చిన చందమామ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.


ఆ తర్వాత ఆయన ఏడు సినిమాలు తెరకెక్కించారు. అన్ని కూడా ఒకదాని నుంచి మరొకటి డిజాస్టర్లు అవుతున్నాయి. గత 18 సంవత్సరాలుగా కృష్ణవంశీకి ఒక హిట్ కూడా లేదు. వినాయక్‌ పేరు చెప్పగానే కమర్షియల్ మాస్ సినిమాలో గుర్తుకొస్తాయి. ఆది - దిల్ - ఠాగూర్ - బన్నీ - లక్ష్మీ యోగి - కృష్ణ - అదుర్స్ - ఖైదీ నెంబర్ 150 సినిమాలు సూపర్ హిట్ లు అయ్యాయి. ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమా 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ సినిమా తర్వాత వినాయక్‌ తెలుగులో మరో సినిమా చేయలేదు. అనంతరం ఛ‌త్రపతి సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీలో రీమేక్ చేసిన అది కూడా ప్లాప్ అయ్యింది.. అంటే గత దశాబ్ద కాలంగా వినాయక్ నుంచి ఒక హిట్టు కూడా లేదు.


ఇక శేఖర్ కమ్ముల కుబేర లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన ఆయన తర్వాత సినిమా ఏమిటో తెలియని పరిస్థితి. కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమా తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా తర్వాత ఎవరు అవకాశం ఇవ్వ‌ని పరిస్థితి. వంశీ పైడిపల్లికి కూడా తెలుగులో వారసుడు తర్వాత మళ్లీ అవకాశాలు ఎవరూ ఇవ్వటం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి నేరుగా తెలుగు సినిమా చేయలేదు. భోళా శంకర్ తర్వాత మెహర్ రమేష్ అంటేనే అందరూ భయపడిపోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. పరశురాంకు కూడా ఎవరు అవకాశాలు ఇవ్వని పరిస్థితి. గూఢచారి - మేజర్ సినిమాల‌ దర్శకుడు శశికిరణ్ తిక్కా తర్వాత సినిమా ఏమిటో తెలియటం లేదు. శివ నిర్వాణ - అజయ్ భూపతి - శ్రీరామ ఆదిత్య - చంద్రశేఖర్ ఏలేటి - క్రిష్ కొత్త సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: