నటుడు ధర్మ మహేష్ ఆయన భార్యకు సంబంధించిన గొడవలు గత కొద్దిరోజుల నుండి మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే గౌతమి ధర్మ మహేష్ పై ఎన్నో ఆరోపణలు చేసింది.ముఖ్యంగా సినీ సెలబ్రిటీలతో ఆయనకు ఎఫైర్లు ఉన్నాయని నన్ను చంపాలని చూస్తున్నాడని ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది.ఈ నేపథ్యంలోనే గౌతమి వెనక టీవీ 5 మూర్తి ఉన్నాడని చాలా రోజుల నుండి ఓ విషయం బయటపడుతుంది. అయితే ఈ విషయం నిజం చేసేలా టీవీ 5 మూర్తి ఎప్పటికప్పుడు ధర్మ మహేష్ కి సంబంధించిన సీక్రెట్స్ మీడియాలో చెప్పుకొస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ధర్మ మహేష్ టీవీ 5 మూర్తి గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు. నా ఫోన్ ని ట్యాప్ చేసి నా ప్రైవేట్ సంభాషణలు, ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని టీవీ5 మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 

10 కోట్లు ఇవ్వకపోతే నీ ప్రైవేట్ వీడియోలన్నీ బయట పెడుతా అంటూ నన్ను వేధిస్తున్నాడు అంటూ ధర్మా మహేష్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఈయన వేసిన పిటిషన్ ని పరిశీలించిన ధర్మాసనం వెంటనే పిటిషనర్ ఇచ్చిన సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించి రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని ఆదేశించారు.దాంతో పోలీసులు మహేష్ ఇచ్చిన సాక్ష్యాలను పరిశీలించి టీవీ5 మూర్తి పై అలాగే ధర్మ మహేష్ భార్య గౌతమి పై బీఎన్ఎస్ లోని సెక్షన్ 308(3),ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 70 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

టీవీ5 మూర్తి మహేష్ ఫోన్ ని చట్ట విరుద్ధంగా ట్యాప్ చేసి ఆయనకు సంబంధించిన ప్రైవేట్ సంభాషణలన్నీ తన చానల్లో ప్రసారం చేశారు.దీంతో మహేష్ తన గోప్యతను అతను దెబ్బతీశారు అని హైకోర్టుని ఆశ్రయించారు. అంతేకాదు 10 కోట్ల డబ్బు చెల్లించకపోతే ఫోన్లోని ప్రైవేట్ సంభాషణలు,ప్రైవేట్ వీడియోలన్నీ బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసినట్టు తన ఎఫ్ఐఆర్లో నమోదు చేశాడు.దీంతో పోలీసులు టీవీ5 మూర్తి పై మహేష్ భార్యపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: