బన్నీ ప్రస్తుతం మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమాలో నటిస్తున్నాడు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ఐకాన్. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట ప్రారంభమైందని తాజా సమాచారం. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ హీరోయిన్ కావాలన్నది బన్నీ కోరికని తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన ఆలియాభట్ అని తెలుస్తోంది. కానీ అదే సాధ్యంకాలేదని ఫిల్మ్ నగర్ నుండి అందిన సమాచారం.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా వున్న ఆలియాభట్ బన్నీ సినిమాకి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే బన్నీ కోరిక మేరకు నిర్మాత దిల్ రాజు టీమ్ ఆలియాభట్ ను సంప్రదించినట్లు, అక్కడ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళి కోసమే ఆలియా చరణ్ పక్కన నటించడానికి అంగీకరించినట్టుగా మరో న్యూస్. 

దాంతో ఇప్పుడు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. అల వైకుంఠపురములో సినిమాకు కూడా హీరోయిన్ల వేట సాగించి, ఆఖరికి పూజాతోనే ఫిక్స్ అయ్యారు. కానీ ఐకాన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కొత్తగా, క్రేజీగా, ప్రాజెక్టుకు మాంచి బజ్ వచ్చేలా హీరోయిన్ వుండాలని ఫిక్స్ అయ్యారు. సాహో రిజల్ట్ చూసిన తర్వాత శ్రద్ధా కపూర్ ను కూడా ట్రయ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆలియా చరణ్ తో నటించడానికి ఒప్పుకొని బన్నీ కి నో చెప్పడానికి సాలీడ్ రీజన్ అయితే కనపడటం లేదని బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. అంతేగా మరి ఇద్దరు మెగా హీరోలలో ఒకరికి ఓకే చెప్పి మరొకరికి నో ఎందుకు చెప్పిందో తెలియాలంటే ఆలియానే ఆన్సరివ్వాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: