-
akhil akkineni
-
brahmanandam
-
Chitram
-
Cinema
-
Comedy
-
Darsakudu
-
Director
-
Divya Bhatnagar
-
Hero
-
Hollywood
-
Hyderabad
-
Kathanam
-
Kavacham
-
Kavuru Srinivas
-
kona venkat
-
Kurradu
-
Love
-
Mahesh Manjrekar
-
mani sharma
-
Music
-
nageshwara rao akkineni
-
Nijam
-
prema
-
Rekha Vedavyas
-
REVIEW
-
Romantic
-
saptagiri
-
Spain
-
srinivas
-
surya sivakumar
-
Telugu
-
thaman s
-
vennela kishore
అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న మొదటి చిత్రం ఇది , అక్కినేని వంశం నుండి వస్తున్న హీరో కావడంతో చాలా అంచనాలే ఉన్నాయి. అఖిల్ ఆ అంచనాలన్నీ నిజం చేసాడు , అతని స్టైల్ మరియు ఆటిట్యూడ్ మరియు అతని డాన్సు అన్ని బాగున్నాయి. కాని కాస్త కంట్రోల్డ్ గా చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. అవసరానికి మించిన ఉత్సాహం కనబరిచి చిత్రంలో ఇమడలేకపోయారు. ఈ విషయం మీద కాస్త దృష్టి సారించి పాత్రకు తగ్గట్టుగా ప్రదర్శన కనబరిస్తే బాగుంటుంది. సయేశ నటనకు పెద్దగా ప్రాధాన్యం లేదు , ఈ నటి కూడా కొన్ని సన్నివేశాలలో అవసరానికి మించిన ఉత్సాహం కనబరిచారు. అఖిల్ మరియు సయేశ ల డాన్సు లు మాత్రం చాలా బాగున్నాయి. అఖిల్ ఫైట్స్ చాలా బాగా చేసాడు. ఇద్దరు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. బ్రహ్మానందం కొద్దిసేపే ఉన్నా అప్పుడప్పుడు నవ్వించారు. వెన్నెల కిషోర్ అప్పుడప్పుడు నవ్వించి ఆకట్టుకున్నారు. మహేష్ మంజ్రేకర్ నటన బాగుంది, రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి రాగిణి మొదలుగునవారు పరవాలేదనిపించారు.
వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథ మొత్తాన్ని ఒక్క లైన్ లో రాసేయ్యచ్చు ఆ ఒక్క లైన్ ని నూట పది పేజి లు రాసుకోడం అంటే అంత సులువేమీ కాదు అందుకే కథన రచయితలు సులువయిన మార్గం అయిన హాలీవుడ్ సినిమాలను ఎంచుకున్నారు ఇండియానా జోన్స్ అనే చిత్ర ఛాయలు చాలా కనిపిస్తాయి. అది కాకుండా లారా క్రాఫ్ట్ , ది క్రాడిల్ అఫ్ లైఫ్ మరియు ది లార్డ్ అఫ్ ది రింగ్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు అంజి దేవి పుత్రుడు వంటి తెలుగు చిత్రాలను జోడించి కథనం తయారు చేసేసారు. దీనికి కోన వెంకట్ రాసిన మాటలు బొత్తిగా నప్పలేదు. దానికన్నా ఘోరం అయిన విషయం ఈ చిత్ర నేరేషన్ అసలు ఎం చెప్తున్నాం అన్న క్లారిటీ దర్శకుడికి కూడా ఉన్నట్టు కనిపించదు ఒక సన్నివేశం రొమాంటిక్ గా సాగుతుంటే ఇంకోటి ఇంకోలా ఉంటుంది ఈ రెండింటికి సంభంధం లేని పాట ఊరికే ఊడిపడుతుంది. తమన్ మరియు అనుప్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. మణిశర్మ నేపధ్య సంగీతం బాగుంది. చిత్రంలో చెప్పుకోదగ్గ ఏకైక పోజిటివ్ అంశం ఇదే , అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది కాని అనవసరం అయిన డ్రోన్ షాట్స్ పదే పదే పెట్టి దాని ప్రాముఖ్యతను ఉపయోగించుకోలేకపోయారు. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది , చాలా నాసిరకంగా ఉండటమే కాకుండా చిత్రానికి ఏ విధంగా ఉపయోగపడలేదు.. శ్రేశ్ట్ మూవీస్ బ్యానర్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..
అఖిల్ మొదటి చిత్రం అనగానే అంచనాలు ఆకాశం లో ఉంటాయి , కాన్సెప్ట్ అయితే మంచిదే కాని కథనం మీద మరింత దృష్టి సారించాల్సింది. చిత్రంలో మెయిన్ ప్లాట్ అయిన జువా ని వదిలేసి ప్రేమ కథకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రేక్షకుడికి అంతు పట్టని విషయం అంతే కాకుండా పాత్రను ఎస్టాబ్లిష్ చెయ్యవలసిన సమయంలో అవసరం లేని పాటలు పస లేని కామెడీ తో నింపేసి చివర్లో అరెరె ఏదో మరిచిపోయాం అన్నట్టు అసలు కథలోకి వస్తే ప్రేక్షకుడి మీద ప్రభావం ఉండదు అన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. చెప్తున్నది సోషియో ఫాంటసీ కాబట్టి అన్ని డాట్స్ పక్క పక్కనే ఉండేలా గమనించుకోవాలి. హీరో అసలు కథలోకి ఎలా వస్తాడు అన్న కుతూహలాన్ని సృష్టించకుండా దర్శకుడు ప్రేమకథలో కామెడీ జొప్పించడానికి ప్రయత్నించారు. అఖిల్ కూడా అవసరానికి మించిన ఉత్సాహంతో పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను తీసుకురాలేకపోయారు. ఒక్క పాటలో ఒక్కటే సిగ్నేచర్ స్టెప్ ఉంటె అది క్లిక్ అవుద్ది కాని ఈ చిత్రంలో పాట పాటకి వంద సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి. అక్కినేని అభిమాని అయితే ఒకసారి చూడదగ్గ చిత్రం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి