అక్కినేని క‌థానాయ‌కులు నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల సినిమా 'మ‌నం' సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వ‌చ్చేనెల 14వ తారీఖులు ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనూప్ స్వ‌రాలు స‌మకూరుస్తారు.

గుండెజారి గ‌ల్లంత‌య్యిందే చిత్రానికి మాట‌లు అందించిన హ‌ర్ష‌కుమార్ కథార‌చ‌న‌లో పాలుపంచుకొన్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్టు తుది మెరుగులు దిద్దుకొంటోంది. అందరూ అనుకొన్న‌ట్టు ఇదేం యాక్ష‌న్ సినిమా కాద‌ట‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా అట‌. ఫ్యాట్ల గోల ఏమాత్రం ఉండ‌ని క్లీన్ సినిమా అని నాగ‌చైత‌న్య చెబుతున్నాడు.

మూడు త‌ర‌ల వార‌ధుల‌ను ఒకేసారి చూడ్డానికి ఆడియ‌న్స్ కూడా రెడీ అయిపోతున్నారు. వ‌చ్చే యేడాది ప్రారంభంలో ఈ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: