చెన్నైలో మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ అయిన గానం నాయర్ నాలుగు రోజులుగా కనిపించకుండా పోయింది. తన కుమార్తె ఈ నెల 26 న స్కూటీ పై వెళ్లిందని, అప్పటి నుంచి ఆమె జాడ తెలియడంలేదని ఢిల్లీ లో ఉంటున్న ఆమె తండ్రి తెలిపారు. ఇప్పుడు గానమ్ నాయర్(28) మిస్సింగ్ మిస్టరీగా మారింది. . ప్రైవేటు టీవీ చానల్లో స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేస్తున్న ఆమె ఈ నెల 26న నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
వీరుగంబక్కమ్లోని ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని, వెంటనే తిరిగి వచ్చేస్తానని బంధువులకు చెప్పి వెళ్లిన గానమ్ ఇప్పటివరకు ఆచూకీ లేదు. దీంతో చెన్నైలోని కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. గానమ్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ అయినట్టు పోలీసులు తెలిపారు. వీరుగంబక్కమ్ నుంచి నన్గంబక్కమ్కు ఆమె వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
నలుపు రంగు హోండా యాక్టివా(టీఎన్ 09 బీయూ 5199) వాహనంపై గానమ్ బయటకు వెళ్లిందని, ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామరని, గానమ్ స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.