
ఇలా మొన్నటివరకు అణు ఆయుధాలు ఏదైనా దేశం దగ్గర ఉన్నాయి అంటే చాలు ఇక అంత కంటే బలమైన ఆయుధాలు లేవు అని అనుకునే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి లేజర్ ఆయుధాలను తయారు చేయడం లాంటివి చేస్తున్నాయ్ ఎన్నో దేశాలు. ఈ క్రమంలోనే చైనా దగ్గర ఇప్పటికే లేజర్ ఆయుధాలు ఉన్నాయి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి ఇటీవల కాలంలో జపాన్ కు సంబంధించిన యుద్ధ విమానం మాయం అవ్వడానికి కూడా లేజర్ ఆయుధాలే కారణం అంటూ ఎంతోమంది రక్షణ రంగ నిపుణులు అంచనా వేశారు.
ఇకపోతే ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా లేజర్ ఆయుధాల తయారీకి సిద్ధమైంది అని తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి అని.. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఆయుధాలు అందుబాటులోకి వస్తాయని రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇక ఈ లేజర్ ఆయుధాలతో సమర్థవంతంగా శత్రు దేశాల ను మట్టుబెట్టే అవకాశం ఉందని క్షణాలు గదిలో శత్రుదేశాల యుద్ధ విమానాలను బూడిదలా మార్చే సామర్థ్యాన్ని లేజర్ ఆయుధాలు కలిగి ఉంటాయని అంచనా వేస్తూ ఉన్నారు నిపుణులు .