ఇటీవల కలలు పొరుగింటి వారు ఎదుగుతున్నారు అంటే లోలోపల అసూయ పడుతూనే.. పైకి నవ్వుతూ మాట్లాడే మనుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎలా పొరుగింటి వాడిని ఎదగకుండా నాశనం చేయాలా.. అని ఏదో ఒక విధంగా వెన్నుపోటు పొడిచేందుకే ఎంతోమంది ఆలోచిస్తున్నారు అనే విషయం తెలిసిందే. చివరికి చేసిందానికి ఏదో ఒక విధంగా కర్మ ఫలితం అనుభవిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది. పొరుగింటికి కి చెందిన వ్యక్తి కోళ్లపై ఫ్లాష్ లైట్ కొట్టి వాటిని చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తికి న్యాయస్థానం ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది అని చెప్పాలి.



 అదేంటి కోళ్లను చంపితే కూడా జైలు శిక్ష వేస్తారా అని అనుమానం మీ మనసులో రావచ్చు. అయితే ఆ నిందితుడు చంపింది ఒకటి రెండు కోళ్లను కాదు ఏకంగా 1100 వందలకు పైగా కోళ్ల ప్రాణాలు తీశాడు. ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. పొరుగు ఇంట్లో ఉంటున్న వ్యక్తితో జాంగ్ అనే వ్యక్తికి వివాదం నడుస్తుంది. తన అనుమతి లేకుండానే తన చెత్తను నరికి వేస్తున్నాడని జాంగ్ ఆరోపించాడు. జాంగ్ పై  పొరుగింటి వ్యక్తి పగ తీర్చుకోవాలని నిర్ణయించాడు. జాంగ్ కు చెందిన కోళ్ల ఫారం లోకి ప్రవేశించి కోళ్ల ముఖాలపై  ఫ్లాష్ లైట్ కొట్టాడు. దీంతో కోళ్లన్ని భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.



 దీంతో పొరుగింటి వ్యక్తి పై జాంగ్  ఫిర్యాదు చేయక.. పోలీసులు అతన్ని పట్టుకుని నష్టపరిహారంగా 35వేల రూపాయలు చెల్లించాల్సిందిగా రాజీ కుదిరించారు. అయితే జాంగ్ పై మరింత ఆగ్రహాన్ని పెంచుకున్న పొరుగింటి వ్యక్తి.. మళ్లీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. మరోసారి కోళ్ల ఫామ్ లోకి వెళ్లి రెండోదప కోళ్ళ ముఖాలపై  టార్చ్ లైట్ వేశాడు. దీంతో ఈసారి 640 కోళ్లను భయపెట్టి చంపాడు. దీంతో పోలీసులు అతని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇక విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉదేశపూర్వకంగానే ఇతరులకు ఆస్తి నష్టం కలిగించాడు అని భావిస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri