2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు చాలామంది అధికార పార్టీ లోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. దాదాపు జగన్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకోవడం జరిగినది. అంతేకాకుండా ముగ్గురు ఎంపీలు కూడా  వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అప్పట్లో వైఎస్ జగన్ తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను చంద్రబాబు అక్రమంగా తన పార్టీలోకి చేర్చుకున్నారు అంటూ అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేసిన గాని పెద్దగా ప్రయోజనాలు దక్కలేదు. అసెంబ్లీలో కూడా అనేకసార్లు ఈ విషయంలో వైయస్ జగన్ మాట్లాడిన టిడిపి మైక్ కట్ చేయడం జరిగింది. 
IHG

అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవడంతో  గతంలో టీడీపీ లోకి వెళ్లి పోయిన వారు తిరిగి వైకాపాలోకి రావటానికి వైసీపీ పార్టీ పెద్దలకి రాయబారాలు పెద్ద ఎత్తున పంపుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. స్థానికంగా టీడీపీ క్యాడర్ ఎవరు తమని పట్టించుకోవడం లేదని, పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు మమ్మల్ని పార్టీలోకి చేర్చుకోండి అని కోరుతున్నారట. 
IHG

జగన్ పార్టీ నుండి చంద్రబాబు పార్టీలోకి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికలలో ఓడిపోవడంతో వారికి ప్రస్తుతం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా సహకరించకపోవడంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్ అటూ ఇటూ కాకుండా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క త్వరలో భారీ ఎత్తున శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో… వాటిని ఆశించే ఈ జంపింగ్ జపాంగ్ లు ఈ విధంగా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు అని వైకాపాలో వారిని వ్యతిరేకించే వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: