తెలంగాణ భాగ్యనగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరు గంట గంటకు పెరుగుతూ వస్తుంది..ఎవరికీ వారే అన్నట్లు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో అధికార పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది.. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా బీజేపి ప్రభుత్వం చేస్తుంది.. ఎటూ చూసిన ఈ రెండు పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ షో లు , ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. 



ఎంతైనా అధికార పార్టీ దూకుడు ముందు మిగిలిన పార్టీలు బలాదూర్.. ప్రచారంలో అయిన దేనిలో అయినా గులాబీ దళం ముందు చిన్నవే.. దుబ్బాక ఎలక్షన్స్ కాస్త బ్రేక్ ఇచ్చిన ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం మాకు మేమే పోటీ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం ఏదో మన పని మనది అంటూ ఉన్నంతలో చేస్తున్నారు. అయితే ఇక కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు బరిలోకి దిగారు.. 



ఈ మేరకు హైదరాబాద్ లోని భారతి నగర్ లో కాంగ్రెస్ నేతలు ప్రచారంలో జోరును పెంచారు. కాంగ్రెస్ చేసిన పనులు గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. భారతి నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల గురించి ఆమె ప్రత్యేకంగా చెప్పారు..కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు గురించి తెలిపారు. గులాబి దళం అధికారం ఉండి కూడా ఏం చేయలేక పోయారు..ఇక బీజేపి పార్టీ విషయానికి మతం పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి మంచి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ వల్ల మాత్రమే అవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. ఉద్యోగాలు యువతకు తెరాస ప్రభుత్వం ఇవ్వలేదు.. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ను గెలిపిస్తే అన్నీ సమస్యలు తొలగిపోతాయని మాధవి లత అన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: