
దేవర సినిమా విడుదలై సరిగ్గా ఈరోజుకి ఏడాది కావస్తున్న సందర్భంగా.. వన్ ఇయర్ ఫర్ దేవర తాండవం అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో అభిమానులు ఒక ట్రెండ్ సృష్టించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం దేవర 2 సినిమాపై కీలకమైన అప్డేట్ అందించారు. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవర 2 కోసం సిద్ధం అవ్వండి అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడంతో అభిమానుల సందేహాలకు చెక్ పడింది.
"ప్రతి తీరాన్ని వనికిస్తూ అలజడి సృష్టించి ఏడాది అయ్యింది.. అప్పటినుంచి ప్రపంచం గుర్తుంచుకునే పేరే దేవర.. అది భయం అయినా, లేదా సంపాదించిన ప్రేమ అయిననా, వీధులు ఎప్పటికీ మర్చిపోవు.. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవర 2 కోసం సిద్ధం అవ్వండి అతి త్వరలో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతున్నామంటూ మేకర్స్ తెలియజేశారు.గత కొద్దిరోజులుగా దేవర 2 ఉండదనే రూమర్స్ చాలానే వినిపించాయి. ఇప్పుడు వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం. దేవర విషయంలో కొరటాల శివ స్క్రీన్ ప్లే , విఎఫ్ఎక్స్ విషయంలో కొంతమేరకు ట్రోల్స్ వినిపించాయి. మరి వాటన్నిటిని దేవర 2 చిత్రంతో చెరిపేస్తారేమో చూడాలి.