దేశంలో ప్రధాని మోడీ ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి దేశంలో పెద్ద హీరో అయిపోయాడు.. అయితే ఆ హీరో కాస్త ఇప్పుడు జీరో గా మారిపోయాడు. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి విలన్ గా కనిపిస్తున్నారు.. ముఖ్యంగా రైతుల పాలిట దెయ్యంగా మోడీ ని అభివర్ణిస్తున్నారు.. ఇదంతా ఒక్క పని వల్లే అంటే అందరు ఆశ్చర్యపోతారు..

పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టం వల్ల దేశంలో ని రైతుల ఆగ్రహానికి గురయ్యారు మోడీ.. ఈ చట్టాన్ని తెచ్చినప్పుడు చాలా పార్టీ వద్దని వాదించాయి.. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ సైతం ఈ బిల్లు కు వ్యతిరేకంగా వాక్ అవుట్ చేశారు. దాంతో ఆదిలోనే మోడీకి హంసపాదు ఎదురైంది. అప్పటివరకు హీరో గా ఉన్న మోడీ లో షాడో నీడలు మొదలయ్యాయి..  సొంత పార్టీ నేతలకు మోడీ తన అసలు స్వరూపం మొదలుపట్టడం మొదలుపెట్టారు.. మోడీ ఏం తేల్చి ఈ బిల్లు ను ప్రవేశపెట్టారో కానీ ఆయనకు గతంలో ఎప్పుడు లేని వ్యతిరేకత మోడలింది.. ఢిల్లీ లో వేలాదిమంది రైతులు ఇప్పుడు చట్టాన్ని రద్దు  చేయాలనీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే..

అయితే తాజాగా వైద్యులు కూడా మోడీకి వ్యతిరేకమవుతున్నారు.  దేశవ్యాప్తంగా వైద్యులు బంద్ పాటించారు. కేంద్రం చేసిన ప్రజా వ్యతిరేక వైద్య చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఆధ్వర్యంలో 12 గంటలు వైద్య సేవలను బంద్ చేసారు. ఇండియన్ డెంటిస్ట్స్ అసోసియేషన్ కూడా బంద్ కు మద్దతు ప్రకటించింది. భారతీయ సనాతన వైద్యం ఆయుర్వేదాన్ని తాము గౌరవిస్తామని, అయితే వారికి శస్త్ర చికిత్సలు చేసే విధానం అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదని వైద్యులు, దంత వైద్యులు స్పష్టం చేసారు. ఆధునిక వైద్య పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ఆపరేషన్ చేయాలంటే, మత్తు డాక్టర్ కీలకమని చెబుతూ ఆయుర్వేదం వైద్యులు ఆపరేషన్లు చేస్తే, మత్తు వైద్యులు లేకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: