ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణ విషయంలో ఇప్పుడు ఉద్యోగులు చాలా సీరియస్ గా ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని విపక్షాలు వాడుతున్నాయి అంటూ పలువురు వైసీపీ నేతలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఏపీలో వైసీపీ బలంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి కలిసి ఈ కుట్రలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎన్. చంద్ర శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. సియస్ ఎన్నికల నిర్వహణ విషయంలో స్పష్టంగా వివరించిన  నిమ్మగడ్డ రమేష్ పంథానికి వెళ్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తామంటే ఉద్యోగులు సహకరించరని ఆయన స్పష్టత ఇచ్చారు. ఎన్నికలను నిర్వహించాలనే మీ పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడతారా అని నిలదీశారు. ఎన్నికల నిర్వహణ  తరువాత అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు కరోన భారిన పడ్డారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 5లక్షల మంది ఉద్యోగులను  పణంగా పెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ, బీహార్ లో ఎన్నికల తరువాత లక్షల మంది ఉద్యోగులకు కరోన సోకింది అని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం మొండి వైఖరి కి పోయి ఎన్నికలు నిర్వహిస్తే మేము ఎన్నికల ను బహిష్కరిస్తాం అని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయని అన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసాయి అని చెప్పారు. ఎన్నికల కమిషన్ ను  నిర్ణయంపై కోర్టును ఆశ్రయించ బోతున్నాం అని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: