ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం కనిపిస్తోంది. అందులోనూ కరోనా సెకండ్ వేవ్ మరింతగా భయపెడుతోంది. అయితే.. కరోనా ప్రాణాంతకం కాదంటున్నారు ప్రఖ్యాత వైరాలజిస్టు ఎం.ఎస్.రెడ్డి. నోబెల్ కు నాలుగు సార్లు నామినేట్ అయిన ఆయన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కరోనాకు ఎందుకు భయపడకూడదు.. కరోనా నుంచి కోలుకోవాలంటే ఏం చేయాలి.. ఏ అలవాట్లు మనల్ని కాపాడతాయి అనే విషయాలపై ఎంఎస్‌రెడ్డి ఇంటర్వ్యూలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఎంఎస్‌ రెడ్డి ఏమంటారంటే.. కరోనా అందరికీ ప్రాణాంతకం కాదంటున్నారు. అన్నీ జలుబులు జ్వరాలు కరోనాయే కాదు! కేవలం వాసన రుచి పోతేనే కరోన వచ్చినట్లు! అప్పుడు మందులు వాడండి! కరోనా కొన్ని ఏళ్ళు మనతోనే ఉంటుంది. మందులు వేసుకుంటూ ఉండటమే! రోగనిరోధకశక్తి పెంచుకోవటమే చికిత్స అంటున్నారు ఎంఎస్ రెడ్డి. వైరస్ పాజిటివ్ వచ్చినా భయపడక్కరలేదట! ఎందుకంటే వైరస్ లేని చోటులేదు..అది సర్వ వ్యాపి..మనం వేసుకొనే మాస్కులు  కొద్దిపాటిరక్షణనే ఇస్తాయి! చౌకబారు మాస్కులు బాక్టరీయానే లోపలకి పంపుతాయి.. దానికన్నా 100 రేట్లు చిన్నదయిన వైరస్ మాస్కులోకి వెళ్లదా? కానీ రక్షణకు మాత్రం పెట్టుకోండి అంటున్నారు ఎమ్మెస్ రెడ్డి.
 

అయితే.. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్న వారికి కరోనా నిజంగా డేంజరేనట. అలాగే ఖర్మ ప్రారబ్దం వల్ల వచ్చిన వంశపారపంపర్య వ్యాధులు వచ్చిన వారు కాస్త అలెర్ట్ గా వుండాలట! మామూలు వాళ్ళకన్నా కాస్త ఎక్కువ కీడు వీళ్లకి వైరస్ చేయవచ్చు! ఊపిరి తిత్తులను పాడు చేయటాన హడావిడి చేయవచ్చు! వారు మాత్రం వైద్యుని సలహా ప్రకారం నడుచుకోవాలని చెబుతున్నారు ఎంఎస్‌ రెడ్డి! అందుకే వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే చెడు అలవాట్లు మానాలంటున్నారు ఎమ్మెస్ రెడ్డి.

మంచి పోషకాహారం తింటే.. ముఖ్యంగా ప్రో బయటిక్స్ ఇచ్చే మజ్జిగ లాటివి తీసుకుంటే కరోనా ఏమీ చేయదంటున్నారు. కరోనా వస్తే  భయపడక జలుబు మందులు.. జ్వరం మందు దగ్గు మందు..ఎలర్జీ మందు..సి విటమిన్ అంటే నిమ్మరసం.. డీ విటమిన్ అంటే రెండు గంటలు ఎండలో నిలిచి వుండాలని చెబుతున్నారు. మంచి బలమైన ఆహారం తీసుకోండి! మీకేమి కాదు! భయమే వద్దు!! ఒక వారంలోనే తేరుకుంటారు అని భరోసా ఇస్తున్నారు. డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: