అందరిని హింసిస్తున్న చైనాలో కూడా ప్రజల నిరసనలు మొదలు అవుతున్నాయి. ఎంత నియంత పాలన అయితే మాత్రం ప్రజలు కూడా ఎన్నాళ్ళు భరిస్తారు. తిరగబడటం ప్రారంభిస్తున్నారు. తాజాగా అక్కడ పని వేళలలో మార్పులు సహించని ప్రజలు తిరగబడ్డారు. గతంలో 8 గంటలు చేసే పని కరోనా కారణంగా సమయం పెంచి 996 పాలసీ ని అమలు చేస్తుంది చైనా. అంటే ఉదయం 9కి కార్యాలయానికి వెళ్లి రాత్రి 9కి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వారంలో 6రోజులపాటు ఈ విధంగానే పనిచేయాల్సి ఉంటుంది. అంటే కరోనా తరువాత అక్కడ అందరు పనివాళ్ళు లేదా ఉద్యోగులు 996 నే అనుసరించి పనిచేస్తున్నారు. 8 గంటలు దాదాపు 12 గంటలు చేస్తే, పని చేయలేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది.

అందుకే చైనా ప్రభుత్వం పై ప్రజలు తిరగబడ్డారు. లేకపోతే పనికే వచ్చేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. సాధారణంగా కమ్యూనిస్టు దేశంగా చెప్పుకుంటున్న చైనా లో మాత్రం కార్మికులను బానిసల్లాగా చూస్తున్న్నారు. సాధారణంగా కార్మిక హక్కుల ప్రకారం గంట భోజనంతో సహా 9 గంటల పని మాత్రమే చేయించుకోవాలి. కానీ చైనా మాత్రం దేశం అసలు విలువలు మార్చేస్తూ ప్రవర్తించడం కమ్యూనిస్ట్ వ్యవస్థకు చెడ్డ పేరు అంటున్నారు నిపుణులు. ఈ విషయంపై కమ్యూనిస్టులు ఏమంటారో మరి వేచి చూడాలి. అక్కడ కార్మికులకు ప్రపంచ వ్యాప్త మద్దతు దక్కినా కూడా చైనా అధ్యక్ష పదవిలో ఉన్న మూర్కుడు ఆ విషయాన్నీ అమలు కనిస్తాడా.. ఇంకా ఎక్కువ కార్మికులను హింసిస్తాడా అనేది చెప్పాల్సిన పని లేదనుకుంటాను.

స్వాతంత్ర ఉద్యమం ముందు చైనాలో జరగాలి. అప్పుడే ముందు అక్కడ ప్రభుత్వం పిచ్చి నుండి ప్రజలు తప్పించుకొని స్వేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి పరిణామం అక్కడ వస్తుందా అంటే అనుమానమే. అందుకే ఉద్యమాలు చేస్తే మాత్రం అక్కడ మూర్కుడు మారిపోతాడా, దిగివస్తాడా అనేది వాళ్లకు తెలుసు. అయినా ఏదో మానవ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కమ్యూనిస్టు ప్రభుత్వంలో దాని సంబంధ విలువలు కూడా మసిబారిపోతున్నట్టే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: